![]() |
![]() |

ఆనందం మూవీ గురించి మీరేదైనా చెప్పాలి అంటే అని హోస్ట్ అడిగేసరికి రేఖా అంటే 5 మినిట్స్ టైమ్ తీసుకుంటారు ఏ రేఖ అని కానీ మీరు ఆనందం రేఖ అని చెప్పండి టక్కున అందరికి గుర్తొచ్చేస్తుంది. ఆ మూవీ నా ఐడెంటిటీ. నిజానికి ఆ మూవీ హీరోగా ఉదయకిరణ్ గారు చేయాలి. నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే రెండు మూడు సార్లు ఉదయ్ కిరణ్ తో మూవీస్ మిస్ అయ్యాయి. కలుసుకోవాలి అని హీరోగా ఉదయ్ కిరణ్ చేసిన మూవీలో నేను చేయాల్సింది." అని చెప్పారు. "నేను ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు అలా వచ్చింది. మనం ప్లాన్ చేసేది ఒకటి దేవుడు ప్లాన్ చేసేది ఇంకొకటి. ఉదయం లేచాక మనం సెట్ కి వెళ్లట్లేదు షూటింగ్ లేదు అనే బాధ ప్రతీ ఆర్టిస్ట్ కి ఉంటుంది.
నేను మళ్ళీ నటించాలనుకుంటున్నాను దానికి ఇండస్ట్రీ సపోర్ట్ ప్రతీ ఒక్కరి సపోర్ట్ కావాలి. ఒక అమ్మాయికి ఒక ఏజ్ ఐపోయింది అంటే ఆంటీ, అమ్మ ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పాలి అంటే ముసల్ది. హెల్త్ ఇష్యుస్ వచ్చినప్పుడు నేను చాలా నొప్పిని అనుభవించాను. చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళు హెల్త్ ఇంపార్టెంట్ మిగతావన్నీ వస్తాయి పోతాయి అని కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలిసింది. నా లైఫ్ ఇంతేనేమో పైకి టికెట్ వచ్చేసిందేమో" అనిపించింది అంటూ అంత బాధలో నవ్వుతూ చెప్పింది రేఖ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఆనందం మూవీలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఫైనల్ గా ఆమె చేసిన మూవీ మేధావి అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వలన ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
![]() |
![]() |